నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
కేజీబీవీ నాన్ టీచింగ్ కార్మికుల కనీస వేతనం రూ.26వేల ఇవ్వాలని, తదితర డిమాండ్లపై సోమవారం చలో హైదరాబాద్ ఎస్పిడి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కానీ ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ పోలీసులతో అరెస్టులు చేయడాన్నీ TUCI ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు వనమాల కృష్ణ తీవ్రంగా ఖండించారు.
మహిళలు అని చూడకుండా అర్థరాత్రి నుండే నాన్ టీచింగ్ మహిళా వర్కర్స్, టియుసిఐ నాయకులను రాష్ట్రవ్యాప్తంగా నిజామాబాద్,అదిలాబాద్, నిర్మల్,నారాయణపేట్, పెద్దపల్లి, సూర్యపేట, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాలో అక్రమంగా అరెస్టు చేసి నేటి ఎస్పీడీ కార్యక్రమన్నీ విఫలం చేయడానికెనని స్పష్టమవుతుందన్నారు.
ఈ ధర్నాను అడ్డుకోవడం అంటే రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతుందని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో పోలీసులతో పాలన సాగిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలతోపాటు ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు, మాట్లాడే హక్కు, పోరాడే హక్కులను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన కేజీబీవీ టి.యు.సి.ఐ నాయకులను బేసరత్తుగా విడుదల చేయాలని నెలసరి వేతనం 26 వేల రూపాయలుగా నిర్ణయించాలని, ఇతర డిమాండ్ల పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేజీబీవీ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి: టీయూసీఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES