No menu items!
Sunday, August 24, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeఖమ్మంపాలస్తీనాపై ఇజ్రాయిల్ ఏకపక్ష దాడులను ఖండించండి: సీఐటీయూ

పాలస్తీనాపై ఇజ్రాయిల్ ఏకపక్ష దాడులను ఖండించండి: సీఐటీయూ

- Advertisement -

నవతెలంగాణ – ఆళ్ళపల్లి (గుండాల) : పాలస్తీనాపై ఇజ్రాయిల్ ఏకపక్ష దాడులను ఖండిస్తూ గుండాల మండల కేంద్రంలో సిఐటీయూ కార్యాలయం నుండి పురవీధులలో సీఐటీయు కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సారమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు అబ్దుల్ నబి పాల్గొని, మాట్లాడుతూ.. గాజా పై ఇజ్రాయిల్ ఏకపక్ష దాడులలో వేలాది మంది మహిళలు, చిన్న పిల్లలు, అమాయక  ప్రజలు మృతి చెందారన్నారు. పాలస్తీనా పై దాడులు నిలిపేయాలని ఐక్యరాజ్య సమితి చెప్పినా ఇజ్రాయిల్ దాడులు ఆపక పోగా మరిన్ని దాడులు చేయడం దారుణమన్నారు. ఈ దాడులను సీఐటీయూ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. నేడు ఇజ్రాయిల్ ఇరాన్ పై దాడులు చేస్తున్నదని అమెరికా సందట్లో సడేమియా లాగా ఇరాన్ ను తమతో అణు ఒప్పందం చేసుకోవాలని అమెరికా బెదిరిస్తుందని వెల్లడించారు. యుద్ధోన్మాదానికి అమెరికా ఆజ్యం పోస్తోందన్నారు. జూలై 9 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటి సభ్యురాలు వజ్జ సుశీల, ఆళ్ళపల్లి మండల కన్వీనర్ సడియం సుగుణ, నజ్మా, పూలమ్మ, చంద్రకళ, లక్ష్మీ, కావేరీ, పద్మ, కౌసల్య, కళావతి, సులోచన, యశోద, సరోజ, విజయ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad