Wednesday, October 22, 2025
E-PAPER
Homeఖమ్మంభద్రాచలం డిపో కండక్టర్ పై అల్లరి మూకల దాడిని ఖండించండి

భద్రాచలం డిపో కండక్టర్ పై అల్లరి మూకల దాడిని ఖండించండి

- Advertisement -

నవతెలంగాణ – మణుగూరు
భద్రాచలం బస్టాండ్ లో విధినిర్వహణలో ఉన్న కండక్టర్ బి ఉమామహేశ్వరావు పై జరిగిన దాడిని తెలంగాణా మజ్దూర్ యూనియన్ టీఎంయూ  ఖమ్మం రీజినల్ కమిటీ తీవ్రంగా ఖండించింది. దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ సందర్బంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఖమ్మం రీజినల్ కార్యదర్శి ఏ. కృష్ణ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం విజయవంతం అవ్వడానికి ప్రధానంగా ఆర్టీసీలో డ్రైవర్ కండక్టర్లే కీలక  పోషిస్తున్నారని అన్నారు ఈ సమయంలో పని భారంతో పాటు ప్రజల నుండి ఇబ్బందులు కూడా ఎన్నో ఎదుర్కొంటున్నారు.

ఈ మధ్యకాలంలో దసరా దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికులను చేరవేసే సమయంలో డ్రైవర్ కండక్టర్లకు మరియు ప్రయాణికులకు మధ్య తరచుగా వాగ్వి వాదాలు జరుగుతున్నాయి.. డ్రైవర్ కండక్టర్లు సమయస్ఫూర్తి ప్రదర్శిస్తూ ఓపికతో విధి   చేస్తున్నారు ప్రయాణికులను ఫుట్ బోర్డు పై నిలబడవద్దని, అందరూ లోనికి రండి లేకపోతే,సాధ్యం కాకపోతే దిగిపోండి, అంటూ 50 మంది ఉండవలసిన బస్సులు 80 నుంచి 100 మంది వరకు ఎక్కించుకొని సర్వీసు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే అన్నారు ఈ సమయములో ఓపిక లేని ప్రయాణికులు కండక్టర్లను డ్రైవర్లను దుర్భాషలాడడం దాడులు తరచు జరుగుతున్నాయన్నారు.

భద్రాచలం బస్టాండ్ లో బి ఉమామహేశ్వరరావు అనే కండక్టర్ పై దాడి జరిగింది కూడా ఈ కోవకు  చెందినది అన్నారు .ఖమ్మం నుండి భద్రాచలం వస్తున్న బస్సు పాల్వంచకు రాగానే పాల్వంచ బస్టాండ్ లో ప్రయాణికులు ఎక్కించుకొని కదులుతున్న సమయంలో ఫుట్ బోర్డుపై నిలబడ్డ ఇద్దరు మహిళలను పైకి రండి లేదా దిగిపోండి కింద పడతారు అని అన్నందుకు జరిగినటువంటి ఘటనను దృష్టిలో పెట్టుకొని భద్రాచలం బస్టాండ్ లో సదరు కండక్టర్ పై దాడి చేశారు.ఈ దుర్ఘటన పై  సమగ్ర విచారణ జరిపి తక్షణమే దోషులను శిక్షించాలని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కండక్టర్ పై దాడిని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -