– హాస్టల్‌లో నీటిసరఫరా బంద్
– ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ హుకుం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ బాచుపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో అమ్మా యిలు ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్‌లో ఉంటున్న అమ్మాయిలకు నీటి సరఫరాను ఆపాలంటూ ఆ వర్సిటీ రిజిస్ట్రార్ ఆదేశాలిచ్చారు. అంతేకాక హాస్టల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ అమ్మాయిలకు హుకుం జారీ చేశారు. దీనిపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని వీసీని ప్రశ్నిస్తే తనకేం సంబంధం లేదనీ, అంతా రిజిస్ట్రార్ చూసుకుంటారంటూ సమాధానమి వ్వడం గమనార్హం. కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేకుండా చేయడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు టీటీసీ, పీహెచ్‌డీ ప్రవేశాలు, గ్రూప్ పరీక్షలు, టెట్ వంటి పరీక్షలకు హాస్టల్‌లో ఉంటూ అమ్మాయిలు సన్నద్ధం అవుతున్నారు. అయినప్పటికీ హాస్టల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ ఆ వర్సిటీ రిజిస్ట్రార్ విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారు. వాచ్‌మెన్ కూడా రాకుండా సెలవు తీసుకోవాలంటూ సూచిస్తున్నారు.
అమ్మాయిలకు న్యాయం చేయాలి : లీలావతి
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాల యంలోని హాస్టల్‌లో ఉంటున్న అమ్మాయిలకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని వినపం ఒక పోరాటం అనే స్వచ్ఛంద విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు లీలావతి చీకూరి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకుంటే ఎవరికి తమ సమస్యను చెప్పుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలుగు వర్సిటీలో అమ్మాయిల అవస్థలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES