Thursday, May 15, 2025
Homeతెలంగాణ రౌండప్న్యాయవాది అకాల మృతికి సంతాపం..

న్యాయవాది అకాల మృతికి సంతాపం..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి: న్యాయవాది పొన్నం వేణుమాధవ్ అకాల మృతికి యాదాద్రి భువనగిరి జిల్లా బార్ అసోసియేషన్ తరపున సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని జిల్లా ప్రిన్సిపల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జయరాజు, డిఎల్ఎస్ కార్యదర్శి మాధవి లత, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఉషారాణి, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొల్లెపల్లి కుమార్ తెలిపారు. గురువారం జిల్లా కోర్టు పరిధిలోని బార్ అసోసియేషన్ హాల్లో పొన్నం వేణుమాధవ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా వేణుమాధవ్ గారు న్యాయవాది వృత్తిలో ఉంటు అనేకమంది పేదలకు, వివిధ వర్గాల ప్రజలకు చట్టపరంగా న్యాయం కోసం చాలా పెద్ద ఎత్తున కృషి చేశాడని అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో అకస్మాత్తుగా కుప్పకూలి హార్ట్ ఎటాక్ తో మరణించడం చాలా బాధాకరం అన్నారు. ప్రభుత్వం న్యాయవాది మృతికి స్పందించి ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు గోద వెంకటేశ్వర్లు, పాశం శ్రీదర్, బబ్బురి హరినాద్, ఎం.చంద్రశేఖర్ రెడ్డి, ఎస్. జంగారెడ్డి , చేగూరి ఐలయ్య , సిహెచ్. సిద్ధిరాములు , శారధ , నాగేంద్రమ్మ  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -