– మహబూబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవ రెడ్డి, మాజీ జెడ్పిటిసిహెచ్ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ బానోతు రవీందర్ మృతి చెందగా అతని కుటుంబాన్ని సందర్శించి పరామర్శించినట్లుగా మహబూబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవ రెడ్డి, మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఆయన పార్దవ దేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాన్ని ఆ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ భానుతు రవీందర్ వ్యక్తి మృతి చెందడం ఈ గ్రామానికి తీరని లోటు అని అన్నారు . ఆయన గ్రామాభివృద్ధికి తన వంతు ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ విధులు అందరికీ అందే విధంగా విధులు నిర్వహించారని అన్నారు. మృతి చదిన కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని కోరుకుంటూ తెలిపారు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం ఆయన పాడే మోసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నెల్లికుదురు టౌన్ అధ్యక్షులు రత్నాపురపు యాకయ్య, బక్కి రెడ్డి, హెచ్చు అలివేలు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.



