Friday, October 17, 2025
E-PAPER
Homeజాతీయంనిష్పక్షపాతమైన దర్యాప్తు జరపండి

నిష్పక్షపాతమైన దర్యాప్తు జరపండి

- Advertisement -

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ‘అహ్మదాబాద్‌’ పైలట్‌ తండ్రి
న్యూఢిల్లీ : అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై నిష్పక్షపాతమైన, సాంకేతికంగా ఉన్నతమైన దర్యాప్తు జరపాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలయింది. ఈ ప్రమాదంలో మరణించిన పైలట్‌ సుమీత్‌ సభర్వాల్‌ తండ్రి పుష్కరరాజ్‌ సభర్వాల్‌, భారత పైలట్ల సంఘం ఈ పిటిషన్‌ వేశారు. సుప్రీంకోర్టు మాజీ మాజీ జడ్జీ నేతృత్వంలో కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని పిటీషన్‌లో కోరారు. ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) సమర్పించిన నివేదికలో కొన్ని అంశాలు పైలట్ల తప్పిదాలను సూచిస్తున్నాయని సెప్టెంబరు 22న సుప్రీంకోర్టు గుర్తించింది. అలాగే మరొక పిటిషన్‌ విచారణలో డీజీసీఏకు నోటీసులు జారీచేసింది.

ఈ నేపథ్యంలోనే విమాన ప్రమాదంపై న్యాయమైన, పారదర్శకమైన దర్యాప్తు జరపాలని 91 ఏండ్ల పుష్కరాజ్‌ సభర్వాల్‌ తన పిటిషన్‌లో కోరారు. ఏఏఐబీ విచారణ పైలట్ల ప్రతిష్టను దెబ్బతీసేవిధంగానూ, లోపభూయిష్టంగానూ, పక్షపాతంగానూ ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే తన కుమారుడు సుమీత్‌ 30 ఏండ్లకు పైగా మచ్చలేని కెరీర్‌ను కలిగి ఉన్నాడని, 15,638 గంటల పాటు విమాన ప్రయాణాన్ని ఒక్క లోపం కూడా లేకుండా నిర్వర్తించాడని పిటిషన్‌లో గుర్తు చేశారు. ఈ పిటిషన్‌ దీపావళి సెలవుల తరువాత విచారణకు వచ్చే అవకాశం ఉంది. జూన్‌ 12న అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 260 మంది మరణించిన సంగతి తెలిసిందే. మృతుల్లో పైలట్‌ సుమీత్‌ సభర్వాల్‌తో సహా 12 మంది సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -