నవతెలంగాణ – హైదరాబాద్: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మి ఐఏఎస్, యూపీఎస్సీ జాయింట్ డైరెక్టర్ సుబ్రమణ్యం చేతుల మీదగా వినయ్ కుమార్ అభినందన, సత్కారం అందుకున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గ్లోబల్ తెలుగు అకాడమీ, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఘనంగా నిర్వహించారు. విజయనర్తనం అనే కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మిశ ఐఏఎస్, యూపీఎస్సీ జాయింట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ఈ అభినందన, సత్కారం యూత్ ఐకాన్ వినయ్ కుమార్ అందుకున్నారు. డాక్టర్ అబ్దుల్ కలాం యువ కెరటం ట్రస్ట్ డైరెక్టర్ ,యూత్ ఐకాన్ వినయ్ కుమార్ చేస్తున్న సేవలను, విద్యార్థుల కోసం యువత కోసం చేస్తున్న కార్యక్రమాలను కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మిశ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు యువత, విద్యార్థుల కోసం చేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సందర్బంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ.. నేను చేస్తున్న కార్యక్రమాల్ని గుర్తిస్తూ ఇలా అభినందన సత్కారం అందించడం చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
యూత్ ఐకాన్ వినయ్ కుమార్ కు అభినందన, సత్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES