Monday, January 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ మంత్రి హరీశ్ రావుకు శుభాకాంక్షలు

మాజీ మంత్రి హరీశ్ రావుకు శుభాకాంక్షలు

- Advertisement -

నవతెలంగాణ- రాయపోల్ 
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీశ్ రావును ఇటీవల నియించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రాజేశ్వర్ రెడ్డి హరీష్ రావును ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలసి, నూతన సంవత్సరం ఆయనకు మరింత ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, ప్రజాసేవలో కొత్త విజయాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలపై శాసనసభలో హరీశ్ రావు పోషిస్తున్న కీలక పాత్ర అభినందనీయమని రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షంలోనూ ప్రజల గొంతుకగా నిలుస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేస్తోందని కొనియాడారు.అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో పార్టీ శ్రేణులు ప్రజల సమస్యల పరిష్కారానికి మరింత నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -