నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన కంకణాల నర్సయ్య ఆత్మ కమిటీ డైరెక్టర్ గా ఎన్నికైన సందర్భంగా ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా చల్వాయి సర్పంచ్ మేకల రాధా సుదర్శన్ మాట్లాడుతూ.. నరసయ్య ఆత్మ డైరెక్టర్ గా మండలానికి విశిష్టమైన సేవలు అందించాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి మాజీ ఎంపీటీసీ గుండెబోయిన నాగలక్ష్మి అనిల్ యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తేళ్ల హరిప్రసాద్, పులుగుజ్జు వెంకన్న, గోవిందరావుపేట సర్పంచ్ లావుడ్య జోగ నాయక్,యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి పొన్నం సాయి తేజ, యూత్ నాయకులు తాటి శ్రీను, మరియు తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఆత్మ కమిటీ డైరెక్టర్ కంకణాల నరసయ్యకు అభినందన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



