నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నాగపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా విజయం సాధించిన కప్పదండి అశోక్ ను స్నేహితులు అభినందించారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అశోక్ సర్పంచ్ గా ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో తనతో కలిసి పదవ తరగతి వరకు చదివిన చిన్ననాటి స్నేహితులు శనివారం నాగపూర్ లో అశోక్ ను కలిసి అభినందించారు. తమ స్నేహితుడు సర్పంచ్ గా విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శాలువాతో సత్కరించారు. సర్పంచ్ గా గ్రామ అభివృద్ధికి పాటుపడి గ్రామ ప్రజల మన్ననలు పొందడం ద్వారా పేరు ప్రతిష్టలు సాధించాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందాలని స్నేహితులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్నేహితులు సున్నం మోహన్, పూజారి శేఖర్, రేంజర్ల మహేందర్, మాసం శ్రీనివాస్ గౌడ్, సాంబారి అశోక్, దూలూరి కిషన్ గౌడ్, గజ్జల శ్రీనివాస్, మల్యాల లక్ష్మణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్ గా గెలుపొందిన స్నేహితునికి అభినందన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



