Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు

రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు

- Advertisement -

ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
నవతెలంగాణ – తుంగతుర్తి
రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేం నరేందర్ రెడ్డి ని ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి శనివారం హైదరాబాదులోని వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి దీర్ఘకాలంగా సేవలు అందించిన సీఎం మాజీ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం పార్టీకి గర్వకారణమని అన్నారు. రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలను సమర్ధవంతంగా ప్రస్తావిస్తూ,రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో వారి వెంట తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి,సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, పిసిసి అధికార ప్రతినిధి ధరావత్ వెంకన్న నాయక్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -