Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆత్మకూరు పోలీసులకు అభినందనలు

ఆత్మకూరు పోలీసులకు అభినందనలు

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు
ఆత్మకూరు పట్టణంలో శనివారం రాత్రి సిఐ కార్యాలయం నందు ఆత్మకూరు సిఐ శివకుమార్, ఎస్ఐ నరేందర్ ను కొల్లాపూర్ కు చెందిన బలరాం, కురుమూర్తి అభినందించినట్లు తెలిపారు. గత బుధవారం రాత్రి కొల్లాపూర్ లో గుర్తు తెలియని దుండగులు పందులను దొంగతనం చేసి బొలెరో వాహనంలో తీసుకొని వెళుతుండగా ఆత్మకూరు నుండి అమరచింత ధన్వాడ నారాయణపేట మీదుగా వెళ్లే సమయంలో ఆత్మకూరు సిఐ ఎస్ఐ  వారిని వెంబడించడంతో చిన్న కడుమూర్, నర్వ ,జక్లేర్, ధన్వాడ ,నారాయణపేట, ప్రదేశాల్లో అక్కడక్కడ 12 పందులను వదిలేసి వెళ్లిపోవడం జరిగింది .ఈ విషయం మాకు తెలియడంతో మేము వచ్చి వాటిని తీసుకువెళ్లాం .వారిని వెంబడించిన సిఐఎస్ఐ లను అభినందిస్తూ శాలువాతో సన్మానించినట్లు వారు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad