Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి ప్రదాతకు అభినందనలు 

అభివృద్ధి ప్రదాతకు అభినందనలు 

- Advertisement -

గొంది కిరణ్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు 
నవతెలంగాణ – గోవిందరావుపేట 

పసర గ్రామానికి అత్యధికంగా నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించిన మంత్రి సీతక్కకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గొంది కిరణ్ అన్నారు. బుధవారం పసర గ్రామంలో కిరణ్ మాట్లాడుతూ 11 కోట్ల రూపాయలను అంతర్గత రహదారుల నిర్మాణం కోసం కేటాయించడం మండల ప్రజల అదృష్టం అని అన్నారు. ఈ నిధులతో గ్రామంలోని ప్రతి వీధి సిసి రహదారిగా మారుతుందని రహదారి సౌకర్యం లేని వీధి గ్రామంలో ఉండదని అన్నారు. ఈ అభివృద్ధిని గ్రామ ప్రజలు ఎప్పటికి మరిచిపోరనీ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ రావడానికి ఈ అభివృద్ధి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మరోసారి అభివృద్ధి ప్రదాత అయిన మంత్రి సీతక్కకు కిరణ్ మరో మరు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -