Thursday, July 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన ఎస్సై మానసకు శుభాకాంక్షలు

నూతన ఎస్సై మానసకు శుభాకాంక్షలు

- Advertisement -

నవతెలంగాణ – రాయపోల్
నూతన ఎస్ఐ మానసను మండల ఆర్ఎంపీ, పిఎంపి డాక్టర్లు మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం ఆర్ఎంపీ, పిఎంపి మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం రాయపోల్ మండల కేంద్రం పోలీస్ స్టేషన్ లో ఎస్సై మానసను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ .. రాయపోల్ మండలంలో శాంతిభద్రతలు కాపాడటంలో నేరాలు నియంత్రణ చేయాలని, జిల్లాలో రాయపోల్ మండలాన్ని ఆదర్శంగా నిలపాలన్నారు. మండల ఆర్ఎంపి, పి.ఎం.పి అసోసియేషన్ రాయపోల్ మండల నూతన కమిటీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి,ఉపాధ్యక్షులు చంద్ర శేఖర్,ముఖ్య కార్యదర్శి గాల్ రెడ్డి,కోశాధికారి బాల చారిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎం.పి, పి.ఎం.పి డాక్టర్లు వెంకటేశం, నర్సింలు, చందు, బాల చారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -