ఏరియా ఉపాధ్యక్షులు ఉత్సవాయి కృష్ణంరాజు
నవతెలంగాణ – మణుగూరు
మణుగూరు ఏరియాలో కార్మికులు క్రమశిక్షణగా బాధ్యతతో రక్షణతో కూడిన ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తున్నారని మణుగూరు ఏరియా ఐ ఎన్ టి యు సి ఉపాధ్యక్షులు వత్సవాయి కృష్ణంరాజు కార్మికులను అభినందించారు. గురువారం 55వ రక్షణ వారోత్సవాలు సింగరేణి వ్యాప్తంగా ఉన్న 132 కెవి సబ్ స్టేషన్ లలో ఉత్తమ సబ్ స్టేషన్ గా మణుగూరు 132 kv ss మొదటి బహుమతి సాధించిన సందర్భంగా ఐ ఎన్ టి యు సి వైస్ ప్రెసిడెంట్ కృష్ణంరాజు బ్రాంచ్ సెక్రటరీ అబ్దుల్ రావు ఏరియా వర్క్ షాప్ ఫిట్ సెక్రటరీ జంపాల శ్రీనివాస్ 132 కె.వి ఎస్ ఎస్ ను సందర్శించి సందర్శించారు.
అధికారులకు మరియు ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా 132 కెవి సబ్ స్టేషన్ అవార్డు పొందుతూ హ్యాట్రిక్ సాధించడం అభినందనీయమని అన్నారు. ఇది మణుగూరు ఏరియా కి గర్వకారణం అని తెలిపారు. క్రమశిక్షణతో బాధ్యతతో రక్షణతో పనిచేస్తున్న ఉద్యోగుల శ్రమకు ఫలితం ఈ బహుమతులు పొందడం అని తెలిపారు. ఇదే స్ఫూర్తితో మునుముందు ఇంకా మరెన్నో బహుమతులు గెలుచుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ మాదాసి శ్రీనివాస్ సూపర్వైజర్స్ సీతారాం రెడ్డి సుధాకర్ మరియు శివ వెంకట్రావ్ వైవిరామారావు మురళి తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి కార్మికులకు అభినందనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES