Sunday, May 4, 2025
Homeఖమ్మంఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులకు అభినందన

ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులకు అభినందన

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట: మండలంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న మామిళ్ళవారిగూడెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 100 శాతం ఫలితాలు సాధించిన విద్యార్ధులు, వారి తల్లిదండ్రులను శనివారం అభినందించారు. స్థానిక పాఠశాలలో నిర్వహించిన ఈ అభినందన సభలో ఎంఈఓ ప్రసాదరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం చక్కటి సౌకర్యాలు కల్పిస్తుంది అని, ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులు చేరాలని, నాణ్యమైన విద్య అందించడానికి ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులు, రవళి (575), దుర్గా భవాని(560) , యామిని(553) తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముగ్గురు విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు ప్రసాదరావు జ్ఞాపికలు బహుకరించారు. అదేవిధంగా గ్రామ పెద్దలు బడపాటి సత్యనారాయణ ప్రధమ, ద్వితీయ , తృతీయ స్థానం పొందిన విద్యార్థులకు 1116, 516,316 చొప్పున నగదు బహుమతిని అందజేశారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహం విద్యార్థులకు రూ.1000 లు నగదు బహుమతి అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -