సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె రాష్ట్రంలో సక్సెస్ అయ్యిందనీ, ఇందులో పాల్గొన్న కార్మికులందరికీ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో పెద్దఎత్తున పారిశ్రామిక కార్మికులు సమ్మెలో పాల్గొని ప్రదర్శనలు, సభలు జరిపారని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, సింగరేణి, బ్యాంక్, ఇన్సూరెన్స్ ఉద్యోగులు, పోస్టల్, సెంట్రల్ గవర్నమెంట్, రక్షణ శాఖ ఉద్యోగులు, మున్సిపల్, గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఐకేపీ, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆరోగ్య శాఖ, మెడికల్ రిప్స్, యూనివర్సిటీ నాన్ టీచింగ్, బీడీ, హమాలీ, భవన నిర్మాణం, మీ-సేవా, ప్రయివేట్ ట్రాన్స్‌పోర్ట్ తదితర అనేక మంది కార్మికులు సమ్మెలో పాల్గొని మోడీ సర్కార్‌పై ఆగ్రహాన్ని వెలిబుచ్చారని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండం, పారిశ్రామిక ప్రాంతాల్లో పెద్దఎత్తున ప్రదర్శనలు నిర్వహించారన్నారు. సమ్మెకు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, వామపక్ష, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు, ప్రజా సంఘాల పోరాట వేదికలతో పాటు పలు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాతంత్రవాదులు, ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయని తెలిపారు. సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతంలో భారీ, మధ్యతరహా, చిన్నతరహా పరిశ్రమల్లో 40వేల మంది, మేడ్చల్ పారిశ్రామిక ప్రాంతాల్లోని 1,384 పరిశ్రమల్లో 54,436 మంది, మెదక్ జిల్లాలో 320 పరిశ్రమల్లో 15వేల మంది, పెద్దపల్లిలో 15,830 మంది పారిశ్రామిక కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని వెల్లడించారు.
9 పబ్లిక్ సెక్టార్లలో (సింగరేణితో సహా) పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులు 43వేల మంది, ఆర్టీసీ ఉద్యోగులు ఏడు వేల మంది, ఇన్స్యూరెన్స్ ఉద్యోగులు 18 వందల మంది, ఫైనాన్స్ సెక్టార్‌లో 18వేల మంది, పోస్టల్, కేంద్ర ప్రభుత్వ, రక్షణ శాఖ ఉద్యోగులు 3,100 మంది, మెడికల్ రిప్స్ 5,700 మంది, మున్సిపల్ కార్మికులు 42వేల మంది, గ్రామ పంచాయతీ కార్మికులు 35వేల మంది, భవన నిర్మాణ కార్మికులు 10లక్షల మంది, ప్రయివేట్ ట్రాన్స్‌పోర్ట్ 370 లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. సింగ రేణి ప్రాంతంలోనూ సమ్మె సంపూర్ణంగా జరిగిందని పేర్కొన్నారు. మణుగూరు ప్రాంతంలో 96శాతం, కొత్తగూడెం 95శాతం, ఇల్లెందు 95శాతం, సత్తుపల్లి 92శాతం, భూపాలపల్లి 94శాతం కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు.
కార్మికులకు అభినందనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



