Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంశ్రామిక వర్గానికి అభినందనలు

శ్రామిక వర్గానికి అభినందనలు

- Advertisement -

– అన్ని దాడులనూ ఎదుర్కొన్నారు
– సమ్మెను విజయవంతం చేశారు
– లేబర్‌ కోడ్‌లు వెంటనే రద్దు చేయాలి : సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ :
దేశవ్యాప్తంగా నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతం కావటంతో శ్రామిక వర్గానికి సీపీఐ(ఎం) అభినందనలు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ”సమ్మెలో పాల్గొనకుండా కార్మికులను పోలీసులు ఇబ్బందులకు గురి చేశారు. కొన్ని చోట్ల లాఠీచార్జి చేశారు. కార్మికులను బెదిరించి, సమ్మెలో పాల్గొనకుండా చేసేలా ప్రయత్నించారు. కార్మికులు వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని, సమ్మెను విజయవంతం చేశారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, వివిధ వర్గాల ప్రజలు కూడా కార్మికులకు సంఘీభావంగా సమ్మెలో పాల్గొన్నారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. శ్రామిక వర్గానికి మద్దతుగా నిలిచి, ఈ సార్వత్రిక సమ్మెను పెద్ద ఎత్తున విజయవంతం చేసిన అందరికీ అభినందనలు. వివాదాస్పద లేబర్‌ కోడ్‌లు, అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన గళాన్ని కేంద్రంలోని మోడీ సర్కారు వినాలి. కార్మిక చట్టాలకు చేసిన సవరణలను వెంటనే రద్దు చేయాలి. వారి హక్కులను కాపాడాలి” అని స్పష్టం చేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad