కురిసిన వర్షంలో
కరిగిన మేఘాలెన్నో
విరిసిన ఇంద్రధనుస్సున
విరిగిన రంగు తెలుసా!
అత్తరు పేరున
నలిగిన పూవులెన్నో
కారిన కన్నీటి మాటున
ఆవిరైన కలలు ఎన్నో!
విప్లవ గేయాల మాటున
రగిలిన గుండె గాయాలెన్నో
విజయాల మాలకు
పుష్ప విలాపాలెన్నో
నీవు నడిచే బాటకు
ఎన్ని కాళ్ళ కవాతులో
రాసిన ప్రతి కవిత వెనుక
కవి పడిన తపన ఎంతో!
బాగుంది అని చెప్పడం
భరువు అని భావిస్తే ఎలా
మన అభినందన
ఎదుటివారికి ఆనందం కాదా!
నీ ఒక్క మెచ్చుకోలు
ఎన్నో మైళ్ళ ప్రయాణానికి ఇంధనం
అడుగుతుంది ధనం కాదు
కళాకారుడికి ఎంతో అభిమానధనం!
– జగ్గయ్య.జి
9849525802