Wednesday, August 6, 2025
E-PAPER
Homeజాతీయం42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ వాయిదా తీర్మానాలు

42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ వాయిదా తీర్మానాలు

- Advertisement -

ఉభయ సభల్లో చర్చకు తిరస్కరణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

పార్లమెంట్‌ వర్షకాల సెషన్స్‌ వాడి వేడిగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉభయ సభల్లో తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ పై కాంగ్రెస్‌ ఎంపీలు వాయిదా తీర్మానాలను అందజేశారు. ప్రశ్నోత్తరాలను పక్కన పెట్టి వాయిదా తీర్మానాలపై వెంటనే చర్చ చేపట్టాలని ఎంపీలంతా పట్టుబట్టారు. తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌పై చర్చకు లోకసభలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోక్‌సభ, రాజ్యసభలో వాయిదా తీర్మానాలపై చర్చకు అనుమతించ లేదు. దీంతో ప్రతిపక్ష నేతలంతా బయటకు వచ్చి పార్లమెంట్‌ ఆవరణలో ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు. అలాగే సమావేశాల ప్రారంభానికి ముందు ‘సర్‌’ కు వ్యతిరేకంగా పార్లమెంట్‌ మకర్‌ ద్వార్‌ కు ఎదురుగా కాంగ్రెస్‌, ఇండియా కూటమి నేతలు ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో సీపీపీ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ, పార్టీ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌, తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పాల్గొన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి… తెలంగాణ ఎంపీల ఆందోళన
బీసీలకు లోకల్‌ బాడీ ఎన్నికలు, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా తెలంగాణ అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులను 9వ షెడ్యూల్‌ లో చేర్చాలని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. పార్లమెంట్‌ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ‘జితనీ ఆబాదీ.. ఇతనీ హిస్సేదారి (ఎంత జనాభాకు అంత వాటా)’ అని రాసి ఉన్న ప్లకార్డులతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -