Sunday, February 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహంగ్ మున్సిపాలిటీల కోసం కాంగ్రెస్ అరాచకం: కేటీఆర్

హంగ్ మున్సిపాలిటీల కోసం కాంగ్రెస్ అరాచకం: కేటీఆర్

- Advertisement -

నవతెంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడిన 34 చోట్ల అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడం, ప్రలోభ పెట్టడం, ఇళ్లకు పోలీసులను పంపడం, గూండాలను ఉపయోగించడం వంటి చర్యలకు దిగుతోందని ఆయన విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సోమవారం మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, మేయర్ల ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -