కాంగ్రెస్ కసరత్తులు సక్సెస్ అయ్యేనా..
స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేనా..
నవతెలంగాణ – మద్నూర్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలను ముందుకు తెచ్చి ఇప్పుడు గద్దెనెక్కి కూర్చుంది. కానీ ఇచ్చిన హామీలలో మహిళలకు ఉచిత బస్సు మినహాయిస్తే ఏ ఒక్కటీ పక్కాగా అమలు చేయడం లేదు. ఇందులో భాగంగా తెలంగాణలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రతిష్టాత్మకంగా ప్రకటించింది. కానీ ఇది కూడా అమలుకు నోచుకోవడానికి నానా తంటాలు పడుతోంది. అయినా ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు అమలుచేస్తుందనే గ్యారంటీ లేదని బీసీలు భగ్గుమంటున్నారు. రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగిసి 20 నెలలు పూర్తి అవుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవి కాలం ముగిసి 14 నెలలు అవుతోంది. గ్రామాల అభివృద్ధికి స్థానిక ప్రజా ప్రతినిధులు లేక సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదు. సర్పంచుల పదవీకాలం 2024 ఫిబ్రవరి 12న ముగిసింది. ఇక ఎంపీటీసీ పదవీకాలం 2024 జూలై 3న ముగిశాయి.
వీరి పదవి కాలం ముగియగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన తీసుకువచ్చింది. అయినా సర్పంచుల స్థాయి సేవలు వీరు అందించలేకపోయారని విమర్శలు కూడా వచ్చాయి. స్థానిక సంస్థలు ఎన్నికలు జరపడానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామనే మాట నిలబెట్టుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది. కానీ హైకోర్టు స్టే విధించడం వలన స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే కసరత్తులు సక్సెస్ అయ్యేనా .. ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేనా అనే చర్చలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.
అయోమయంలో కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ హామీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES