Saturday, February 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సోపూర్ లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

సోపూర్ లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని సోపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ దంతోడే తుకారం ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తుకారం మాట్లాడుతూ.. బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆధ్వర్యంలో పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ వార్డు సభ్యులు గెలవడంతో మున్సిపాలిటీ చైర్మన్ పీఠంపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్మన్ కావడం వలన తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు మండలవాసులు బ్రహ్మరథం పట్టారు. అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు ఎమ్మెల్యే గారికి మా గ్రామం కాంగ్రెస్ పార్టీ తరపున అభినందనలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామం మాజీ సర్పంచ్ భర్త సూర్నార్ శివాజీ పటేల్ , కాంగ్రెస్ నాయకులు జాన్సన్, గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -