నవతెలంగాణ – చారకొండ
బీసీ రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని రోజులపాటు మోసపూరితంగా వ్యవహరించిన తీరు హైకోర్టు స్టే విధించడంతో తేటతెల్లమైందనీ బిజెపి నాయకులు చింతపల్లి కిరణ్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుల గణన శాస్త్రీయ పద్ధతిలో లేకపోవడం వల్లనే హైకోర్టు స్టే విధించిందని విమర్శించారు, గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం 32 శాతం ఉన్నా బిసి రిజర్వేషన్ 23%కి తగ్గించి ,రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా చట్టం చేసే బీసీలను మోసం చేసిందన్నారు ,కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మాయమాటలతో అధికారంలోకి వచ్చిన, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ఓట్లతో లబ్ధి పొందాలని కుట్ర చేస్తుందని ,కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేశారు
మాయ మాటలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES