నవతెలంగాణ – బంజారా హిల్స్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. షేక్‌పేట్‌లోని ఎమ్మార్వో కార్యాలయంలోని ఎన్నికల కేంద్రంలో మొదటి సెట్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ సి.ఎన్.రెడ్డి సమక్షంలో రిటర్నింగ్ అధికారి పి.సాయిరాంకు అందజేశారు. రెండో సెట్‌ను మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, కాంగ్రెస్ నాయకులు హబీబా సుల్తానాతో కలిసి అధికారికి సమర్పించారు. అంతకుముందు ఎమ్మార్వో కార్యాలయానికి నవీన్‌యాదవ్ భారీ ర్యాలీగా చేరుకున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఐదోరోజు శుక్రవారం 20 మంది 23 నామినేషన్లు దాఖలు చేశారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES