Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వనిత ప్రచారం

9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వనిత ప్రచారం

- Advertisement -

– నన్ను గెలిపిస్తే వార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తా 
– అభ్యర్థితో కలిసి ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ 
నవతెలంగాణ – కామారెడ్డి 

కామారెడ్డి మున్సిపల్ లోని తొమ్మిదవ వార్డులో సోమవారం అవార్డు అభ్యర్థి ఉర్దూండ వనిత తో కలిసి షబ్బీర్ అలీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నిలబెట్టిన ఉర్దూండ వనితకు మీరు అందరూ కలిసి ఓట్లు వేయాలని, మీరు ఓట్లు వేయడం వల్ల మీ వార్డ్ మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా అభివృద్ధి జరుగుతుందనీ ఆయన వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నో పార్టీలు వచ్చిన ఏమి అభివృద్ధి చేయడం లేదని కేవలం అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ జెండాను కామారెడ్డి మున్సిపల్ పై ఎగిరేందుకు మీరంతా సహకరించాలని మున్సిపల్ ప్రజలకు సూచించారు. అనంతరం అభ్యర్థి వనిత మాట్లాడుతూ తాము ప్రజాసేవ చేయడానికి వచ్చామని, అది కాంగ్రెస్తో నే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నానన్నారు. తనని గెలిపించి మన వార్డ్ అభివృద్ధి ఎంతలా జరుగుతుందో చూడాలన్నారు. మీ సమస్యలను తీర్చడమే లక్ష్యంగా నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -