Saturday, September 13, 2025
E-PAPER
Homeజిల్లాలుజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి ప్రణాళిక 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి ప్రణాళిక 

- Advertisement -

టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి 
నవతెలంగాణ – పాలకుర్తి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించేందుకు ప్రణాళికను రూపొందించామని టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాదులో గల అనసూయ రెడ్డి నివాసంలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిలు కస్స శ్రీనివాస్, ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి లతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం అవలంబించాల్సిన వ్యూహం పట్ల చర్చించామని తెలిపారు. బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేసి పార్టీ శ్రేణులు చురుకుగా పనిచేసేందుకు వ్యూహాలను రచించామని తెలిపారు. వార్డుల వారీగా సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ప్రణాళికను తయారు చేయాలని తెలిపారు.

ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్య పరచాలని, ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెళ్లి ప్రజలకు సంక్షేమ పథకాల పట్ల అవగాహన కల్పించి చైతన్యం చేసేందుకు వ్యూహాన్ని రచించామన్నారు. సమిష్టి కృషితో వ్యక్తిగత బాధ్యతగా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించేందుకు ప్రతి కర్యకర్త సైనికుని వలె పనిచేసేందుకు మన ధైర్యాన్ని కల్పించాలని తీర్మానించామన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపయోగి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించేందుకు కార్యకర్తలందరూ అహర్నిశలు కృషి చేసే విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిలందరూ ఐక్యంగా పనిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -