ఎఎంసీ చైర్మన్ గంగారెడ్డి,టి పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఐక్యతతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని,విభేదాలను వీడి అందరు ఐక్యతగా ఉండి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,టి పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ చెప్పారు. మంగళవారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని కెఎన్ఆర్ గార్డెన్లో ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. పనిచేసే అభ్యర్థులకు పార్టీ బీ ఫారం ఇస్తుందని, టికెట్ ఎవరికి వచ్చినా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్పై దుష్ప్రచారం చేస్తాయని, సీఎం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి ఓట్లు అడగాలని కోరారు.
అంతకుముందు డీసీసీ డెలిగెట్ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ…జిల్లాలో డిచ్ పల్లి కి ఒక ప్రత్యేకత ఉందని, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకొవడానికి కార్యకర్తలు, నాయకులు చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 35 ఏళ్ళుగా నియోజక వర్గంలో కాంగ్రెస్ నాయకులు ఇబ్బందులు పడ్డారని, ఐక్యతతో అభ్యర్థుల విజయానికి కృషి చేసి గ్రామాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి కృషి తో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కోర్ కమిటి సభ్యులు మునిపల్లి సాయిరెడ్డి, బాబురావు, కంచెట్టి గంగాధర్ మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ నర్సయ్య, సహకార సొసైటీ చైర్మన్లు రాంచందర్ గౌడ్,చింత శ్రీనివాస్ రెడ్డి, కోస రాజు రామకృష్ణ, మండల కార్యదర్శి లచ్చమోల్ల దత్తద్రి, సీనియర్ నాయకులు వాసుబాబు, డీసీసీ డెలిగెట్స్ వాసుబాబు, మాజీ కో ఆప్షన్ సభ్యులు శ్యాంసన్, డాక్టర్ షాదుల్లా, డాక్టర్ జాహూర్, ధర్మగౌడ్, డైరెక్టర్ దేవకరుణ, తోపాటు జిల్లా ,మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.