Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్బీసీల‌కు 42శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు ప‌ట్ల కాంగ్రెస్  సంబ‌రాలు

బీసీల‌కు 42శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు ప‌ట్ల కాంగ్రెస్  సంబ‌రాలు

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పట్ల  జిల్లా కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాసేవ భవన్ నుంచి సోమవారం ర్యాలీ నిర్వహించారు. రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి మద్దతుగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకొని  సంబరాలు చేసుకున్నారు. బీసీ నేత‌లంద‌రు ప్ర‌భుత్వానికి సీయం రేవంత్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ ప్రముఖుల ఫ్లెక్షీల‌కు పాలాభిషేకం చేశారు. బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందడం పట్ల బీసీ లందరూ ఎంతో గర్విస్తున్నారని అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇది చారిత్రాత్మక నిర్ణయం అన్నారు.. ఒక ఓసి ముఖ్యమంత్రి అయి ఉండి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయటాన్ని ఆయన స్వాగతించారు. ఇది బీసీ లందరికీ గర్వకారణం అన్నారు. స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలై తీరుతుంద‌న్నారు. ఆరు నూరైనా బీసీ బిడ్డలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు సరైన న్యాయం చేసిందన్నారు .42 శాతం రిజర్వేషన్ తో సత్కరించిందన్నారు. ఈ బిల్లు పట్ల కేవలం బీసీలు మాత్రమే కాకుండా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారన్నారు. బిజెపి బీఆర్ఎస్ లు బీసీలను కేవలం ఓటు బ్యాంకు గానే చూశాయని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వాళ్లకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి సరైన న్యాయం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad