Thursday, January 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ మోసం 

ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ మోసం 

- Advertisement -

– బి ఆర్ ఎస్ పాలనలో హుస్నాబాద్ అభివృద్ధి 
– ఇంటింటికి కాంగ్రెస్ బాకీ పడ్డ గ్యారెంటీ కార్డు పంపిణీ 
హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

సాధ్యం కానీ ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ మండిపడ్డారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ ఇంటింటికి బాకీ పడ్డ గ్యారెంటీ కార్డులను మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్, బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో మాట్లాడారు గత బిఆర్ఎస్ పాలనలోనే హుస్నాబాద్ అభివృద్ధి జరిగిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అభివృద్ధిని మరిచిందన్నారు. అమలు గాని హామీలు ఇచ్చి ఇంటింటికి గ్యారెంటీ కార్డులు ఇచ్చి భద్రంగా ఉంచుకోవాలని చెప్పి నమ్మబలికి గద్దె నెక్కిందన్నారు.

6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఉచిత బస్సు తోటి సరిపుచ్చుకుని మిగతా హామీలు తుంగలో తొక్కారన్నారు.  కాంగ్రెస్ పార్టీ కి ఓటు అడిగే నైతిక హక్కు లేదని, ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని అన్నారు .  గత ప్రభుత్వ హయాంలోనే హుస్నాబాద్ పట్టణం, నియోజకవర్గం అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎటు పోయిందని ,వృద్ధులకు వితంతువులకు 4వేల పింఛన్ ఏమైందన్నారు. వికలాంగులకు 6000 వేలు, రైతు బంధు, రుణమాఫీ ఏమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్న హామీలు అమలు అయ్యేంతవరకు పోరాటం చేయాలని, అమలు గాని హామీలు ఇచ్చి విఫలమైన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ అభ్యర్థుల కారు గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు . ఆయనతోపాటు హుస్నాబాద్ పట్టణ నాయకులు కార్యకర్తల అభిమానులు, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -