Saturday, February 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనిజామాబాద్‌లో ఆరు చోట్ల కాంగ్రెస్‌ క్లీన్‌స్విప్‌

నిజామాబాద్‌లో ఆరు చోట్ల కాంగ్రెస్‌ క్లీన్‌స్విప్‌

- Advertisement -

కామారెడ్డిలో హంగ్‌.. ‘చే’జిక్కించుకునేందుకు యత్నాలు
కార్పొరేషన్‌లో పెరిగిన సీట్ల సంఖ్య
మేయర్‌ సీటును దక్కించుకునేందుకు ప్లాన్‌
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాల్టీలకు గాను 6 మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. చైర్మన్‌ సీటు గెలిచేందుకు అవసరమైన మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. అయితే కామారెడ్డిలో 49 స్థానాలకు గాను 19 గెలుపొందగా.. మ్యాజిక్‌ ఫిగర్‌కు 6 స్థానాల దూరంలో ఉంది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు గెలుపొందగా, బీఆర్‌ఎస్‌ 11, బీజేపీ 16 స్థానాలు గెలిచారు. చైర్మన్‌ సీటు పొందాలంటే ఓ పార్టీ మరో పార్టీ మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో సైతం గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య పెంచుకుంది. గత ఎన్నికల్లో 2 స్థానాలు గెలవగా.. ఈసారి 17 స్థానాలతో సత్తా చాటింది. నిజామాబాద్‌లో మేయర్‌ స్థానం, కామారెడ్డిలో చైర్మన్‌ స్థానం స్థానం పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఉమ్మడి నిజామాబాద్‌లో మొత్తం 238 స్థానాలకు గాను కాంగ్రెస్‌ 111 గెలుచుకోగా.. బీఆర్‌ఎస్‌ 32, బీజేపీ 58, ఎంఐఎం 28 స్థానాలు గెలుపొందాయి. మొత్తం ఫలితాల్లో 46 శాతం వార్డులు కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. నిజామాబాద్‌ జిల్లాలో నిజామాబాద్‌ మినహా.. బోధన్‌, భీంగల్‌, ఆర్మూర్‌లో మెజార్టీ స్థానాలు గెలుపొందింది. అదే విధంగా కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుందలో సైతం అత్యధిక స్థానాలు గెలుపొంది చైర్మన్‌ సీటు కైవసం చేసుకోనుంది. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా బీజేపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. కాంగ్రెస్‌ నుంచి మహేశ్‌కుమార్‌గౌడ్‌ టీపీసీసీ అధ్యక్షులుగా వ్యవహరించడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఆది నుంచి భావించినట్టు బీజేపీ, కాంగ్రెస్‌, ఎంఐఎం మధ్య త్రిముఖ పోరు నెలకొంది. బీఆర్‌ఎస్‌ నాలుగైదు డివిజన్‌లలో తీవ్ర పోటీ ఇచ్చినా మిగతా డివిజన్‌లలో మాత్రం తేలిపోయింది. అయితే బీజేపీ 28 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్‌ 17, ఎంఐఎం 14, బీఆర్‌ఎస్‌ ఒక స్థానంలో గెలుపొందాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -