– సిబిఐ అంటే కాంగ్రెస్ బిజెపి ఇన్వెస్టిగేషన్
– వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద బిఆర్ఎస్ శ్రేణుల ధర్నా, నిరసన
– పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులు
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
సిబిఐ విచారణ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. మంగళవారం వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు, రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 63వ నంబర్ జాతీయ రహదారిపై ధర్నా, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ వర ప్రధాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ పై, కేసీఆర్, హరీష్ రావు లపై బురద జల్లుతు సిబిఐ ఎంక్వయిరీ పేరుతో కాంగ్రెస్ చేస్తున్న కుట్ర రాజకీయాలకు వ్యతిరేఖంగా నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి నియోజకవర్గం లోని పార్టీ శ్రేణులు శ్రేణులు పెద్ద వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద తరలివచ్చారు. కేసీఆర్ పై బురద జల్లాడానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆరోపణలు, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కేసును సిబిఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.
ఈ సందర్బంగా పలువురు బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కక్ష్య పూరిత రాజకీయాలను ఎండగట్టారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొట్టుకపోయిన పెద్దవాగు, కూలిన సుంకిశాల, కుప్పకూలిన ఎస్ఎల్బీసీ టన్నెల్ వీటన్నిటిపై కమిషన్లు, సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ ప్రజల యొక్క జీవనాడి ప్రపంచంలోనే అతి పెద్దదైన మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాలేశ్వరం గొప్పతనాన్ని, వాస్తవాన్ని ప్రజలకు చెప్పటానికి ప్రయత్నం హరీష్ రావు ప్రయత్నం చేశారన్నారు.ఎలక్షన్ వచ్చిందంటే ఏదో ఒక డ్రామాతో ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్, బిజెపి కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ కాదు కాంగ్రెస్ బిజెపి ఇన్వెస్టిగేషన్ల మారిందన్నారు.మేడిగడ్డను రిపేర్ చేసి తెలంగాణ ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు కానీ ఈ ప్రభుత్వం గత 20 నెలలుగా మేడిగడ్డను రిపేర్ చేయకుండా వదిలేసిందని, తద్వారా చంద్రబాబు నాయుడుకి మేలు చేకూర్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడన్నారు.
సిబిఐ ఎంక్వయిరీ పేరిట శాశ్వతంగా మేడిగడ్డను పనికిరాకుండా చేసి కిందికి నీళ్లు పంపియ్యాలని రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారన్నారు.ఏడు వేల కోట్ల విలువగల పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ కొట్టకపోతే ఎలాంటి ఎంక్వయిరీ లేదు, చంద్రబాబుపై కూడా సిబిఐ ఎంక్వయిరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు.కేసిఆర్ పై, కేటీఆర్ పై, హరీష్ రావులపై కుట్రతో కేసులు పెట్టి జైలుకు పంపాలని చూస్తున్న తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంటే ఉంటారన్నారు. రేవంత్ రెడ్డి మీరెన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, కేసులు మా పార్టీ నాయకులకు కొత్త కాదు, న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉందన్నారు.మీరెన్ని కేసులు పెట్టిన న్యాయస్థానంలో, ప్రజా క్షేత్రంలో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా బిఆర్ఎస్ పార్టీ మీ వెంట పడుతూనే ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సింగిల్ విండోల చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సీబీఐ విచారణ పేరుతో కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES