నవతెలంగాణ – హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత చేసిన వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ పార్టీ పెద్ద కుట్ర పన్నిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని విడదీసి, బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచేందుకే కాంగ్రెస్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ఆయన విమర్శించారు. కవిత సస్పెన్షన్ అనేది పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు తీసుకున్న నిర్ణయమని పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందువల్లే ఈ చర్యలు తప్పలేదని వివరించారు. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా, ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. పార్టీలో ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారని అన్నారు. కానీ తమకు కేసీఆర్ ఆదేశాలే శిరోధార్యమని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ కుట్ర: ఎమ్మెల్యే పల్లా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES