నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బర్దిపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసేందుకు శుక్రవారం విచ్చేశారు. అందులో భాగంగా సభ ఆవరణంలో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. పక్కాగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం ముమ్మారం చేసి 60 డివిజన్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది. ఎక్కడ ఎలాంటి అవసరాలు ఉన్న టిపిసిసి అధ్యక్షులు అందుబాటులో ఉంటారని జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులు, వివిధ చైర్మన్లు కార్పొరేటర్ అభ్యర్థులకు అందుబాటులో ఉండి సహకరించాలని ముఖ్యమంత్రి తెలిపినట్లు సమాచారం.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులు
- Advertisement -
- Advertisement -



