నవతెలంగాణ-చిన్నకోడూరు
రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చిన్నకోడూరు మండల పార్టీ అధ్యక్షులు కాముని శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రమైన చిన్నకోడూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు పంట కాలానికి ముందే అంటే వరి నాట్లు వేసే కంటే ముందే కాలువల ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు నింపి రైతులకు ఇబ్బంది లేకుండా పంటలు సకాలంలో పండే విధంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులకు, ప్రభుత్వానికి రైతుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మండలంలో గ్రామాలకు మధ్యలో ఆగిపోయిన పంట కాలువల నిర్మాణానికి, భూసేకరణకు తక్షణమే నిధులు విడుదల చేసి కాలువలు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే చంద్లపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. రైతులకు 24 గంటల విద్యుత్తు సరఫరాచేసి వ్యవసాయానికి ఇబ్బందిలేకుండా అందించి పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో బిఅర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పంపరి కనకయ్య, ఫాక్స్ మాజీ ఛైర్మన్ ములకల కనకరాజు, మాజీ వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాముని ఉమేష్ చంద్ర, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి, జంగిటి శ్రీనివాస్, ములకల కుంటయ్య, మొండయ్య, వైకుంఠం, దేవయ్య, ఏలేటి రాజిరెడ్డి, పెండ్యాల బాలయ్య, సంతోష్, బంక పోచయ్య, నముండ్ల హరీష్, పుచ్చకాయల సురేందర్ రెడ్డి, నునుగొప్పుల బాలయ్య, యువజన విద్యార్థి నాయకులు చెట్టుపల్లి భానుచందర్, మన్నె ఆనంద్, ఎదుల్ల రాజిరెడ్డి, గొల్లపల్లి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



