Thursday, October 30, 2025
E-PAPER
Homeకరీంనగర్కాంగ్రెస్ బాకీ కార్డు ఇంటింటికీ పంచుతాం

కాంగ్రెస్ బాకీ కార్డు ఇంటింటికీ పంచుతాం

- Advertisement -

సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ కార్డు విడుదల: మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెబుతారని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను ఉద్దేశపూర్వకంగా మోసం చేసిందని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో స్థానిక బిఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేశారు. అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలులో నిర్లక్ష్యంగా వహించిందని విమర్శించారు. ఇచ్చిన హామీల ప్రకారం ప్రజలకు బాకీ పడ్డ పథకాల వివరాలను కాంగ్రెస్ బాకీ రూపంలో ముద్రించి ప్రజలకు ఇంటింటికి పంచుతామన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఎందుకు మాకూ ఈ ఇబ్బందులు అని ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -