Friday, February 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా సంఘాల బలోపేతానికి కాంగ్రెస్ కృషి

మహిళా సంఘాల బలోపేతానికి కాంగ్రెస్ కృషి

- Advertisement -

మండల అధ్యక్షుడు కమలాపురం రమేష్
నవతెలంగాణ – ఆత్మకూరు 
మహిళా సంఘాల సభ్యుల అన్ని విధాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆత్మకూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కమలాపురం రమేష్ తెలిపారు. శుక్రవారం మండలంలోని హౌజుబుజుర్గు గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి స్థానిక సర్పంచ్ సయ్యద్ మౌలా తో కలిసి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రమేష్, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి మహిళా సామాఖ్యలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

“మహిళా సంఘాల బలోపేతం ద్వారా స్థానిక మహిళలు స్వావలంబన పొంది, సమాజంలో ముందుంచుకుంటారు” అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మార్క సుమలత, కాంగ్రెస్ సేవా దల్ అధ్యక్షులు ఏరుకొండ రవీందర్, కటాక్షపూర్ సర్పంచ్ షబానాగఫూర్, మాజీ జెడ్పీటీసీ కక్కేర్ల రాధిక రాజు,మండల నాయకులు పరికరాల వాసు,అలువాల రవి, ఉపసర్పంచ్ బోడిగే లక్ష్మీ రాంబాబు, వార్డు సభ్యులు కరీంబి బషీర్, హుస్సేన్, షేక్ కమల్, ఎంపిడిఓ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -