Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంబీసీలను వంచించే కుట్రకు తెరలేపిన కాంగ్రెస్‌

బీసీలను వంచించే కుట్రకు తెరలేపిన కాంగ్రెస్‌

- Advertisement -

– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ అమలు చేయకుండా బీసీలను వంచించాలని చూస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల జాగృతి కార్యాలయంలో పలువురు బీసీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ ప్రధాని అయ్యాకే బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడమంటే వాటిని అటకెక్కించడమేనని విమర్శించారు.
ఎన్నికల ముందు ఇదే విషయాన్ని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వారినే మోసం చేస్తోందని ఆరోపించారు. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడమనేది కంటితుడుపు చర్య మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్‌ చేస్తున్న మోసాన్ని ప్రజల్లో ఎండగడతామని స్పష్టం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img