Saturday, October 18, 2025
E-PAPER
Homeకరీంనగర్బీసీ సంఘాల బంద్ కు కాంగ్రెస్ సంఘీభావం

బీసీ సంఘాల బంద్ కు కాంగ్రెస్ సంఘీభావం

- Advertisement -

బీసీల నోటికాడి బుక్క లాక్కుంటున్న బిజేపి
ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తోంది
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
18న బంద్ విజయవంతం చేయాలని పిలుపు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

బీసీ సంఘాల బంద్ కు కాంగ్రెస్ సంఘీభావం తెలుపుతుందని, బీసీల నోటికాడి బుక్కను కేంద్ర బిజేపి ప్రభుత్వం లాక్కుంటుందని, రాష్ట్రంలో ఉన్న 8 మంది ఎంపీలు బీసీ బిల్లునుపై కేంద్రాన్ని ఎందుకు ఒప్పించడం లేదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన మాట కోసం బీసీలకు 42 శాతం విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ కల్పించడానికి ప్రభుత్వం కృషి చేసిందని, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపిందని గుర్తు చేశారు. ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు వెళుతున్న క్రమంలో హైకోర్టు స్టే ఇవ్వడం జరిగిందని, నిపుణులను సంప్రదించి కోర్టులో న్యాయపరంగా కొట్లాడుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో 50 శాతం క్యాబ్ ఎక్కడ లేదని, జీవో 9 పై కోర్టులో సవాలు చేశారుగానీ చట్టాన్ని కాదని స్పష్టం చేశారు. ప్రజలను మేల్కొల్పే విధంగా బీసీ సంఘాలు చేపట్టిన తెలంగాణ బంద్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి సంఘీభావం తెలుపుతుందని, 18న నిర్వహించే రాష్ట్రవ్యాప్త బందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -