Thursday, February 12, 2026
E-PAPER
Homeకరీంనగర్సిరిసిల్ల మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురుతుంది

సిరిసిల్ల మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురుతుంది

- Advertisement -

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రకాష్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సిరిసిల్ల మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ అన్నారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, చొప్పదండి ప్రకాష్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయడానికి అహర్నిశలు కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని ప్రకటించారు.1988 నుండి నేటి వరకు సిరిసిల్ల మున్సిపల్ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరలేదని, ఈసారి మున్సిపల్ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ  ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైద్య శివప్రసాద్, నీలి రవీందర్, బొప్ప దేవయ్య, లక్ష్మణ్, శ్రీనివాస్,గోనె ఎల్లప్ప, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నక్క నరసయ్య, గొల్లపల్లి పరశురాములు, కాజా మొయినుద్దీన్ నేరెళ్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -