బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ
నవతెలంగాణ-పాలకుర్తి
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి ల ఆదేశాల మేరకు శనివారం మండలంలోని వావిలాల, కొండాపురం గ్రామాల ఎంపీటీసీ క్లస్టర్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల భాస్కర్ నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, కాంగ్రెస్ పార్టీ మండల కోఆర్డినేటర్ శ్యాంసుందర్ రెడ్డి తో కలిసి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం, పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
పేదల అభ్యున్నతి లక్ష్యంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిలు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో పాలకుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పట్టుదలతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిందని, పెట్టుబడి సహాయానికి రైతులకు రైతు భరోసా అందించిందని, గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం లతోపాటు వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిందని తెలిపారు, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు గ్రామాల అభివృద్ధికి, పేదల అభ్యున్నతి కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యమన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి మాజీ కార్యదర్శి గంగు కృష్ణమూర్తి, దేవస్థానం మాజీ చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ లు గడ్డం యాక సోమయ్య, కారుపోతుల శ్రీనివాస్ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి మదర్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జలగం కుమార్, ఆయా గ్రామాల అధ్యక్షులు వేణు, అంజయ్య, ప్రభాకర్, బాలాజీ లతోపాటు ఎంపిటిసి క్లస్టర్, గ్రామాల ఇన్చార్జిలు నునావత్ హరిలాల్ నాయక్, కిషన్ నాయక్, ముత్తినేని కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES