గాంధీభవన్‌లో సంబురాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించటంతో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లోని పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో సంబరాలు జరుపుకున్నారు. ఫలితాలు ప్రారంభమైన సమయానికే వారు గాంధీ భవన్‌కు చేరుకుని జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి విజయాన్ని సంబరంగా జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి, ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకుంటూ హర్షాతిరేకలు వ్యక్తం చేశారు. ”సీఎం రేవంత్ రెడ్డి జిందాబాద్”, ”టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిందాబాద్”, ”రాహుల్ గాంధీ జిందాబాద్”, ”మల్లిఖార్జున ఖర్గే జిందాబాద్” అంటూ నినాదాలతో గాంధీ భవన్ మారుమోగింది. కాంగ్రెస్ ముఖ్యనేతలు పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారని నేతలు వ్యాఖ్యానించారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



