నవతెలంగాణ -భిక్కనూర్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోసం ప్రజలకు పథకాల పేరుతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పట్టించుకోవడం లేదని మండల బిజెపి నాయకులు తెలిపారు. శనివారం పట్టణ కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో బిజెపి ఆధ్వర్యంలో నిరసన తెలిపి తాసిల్దార్ సునీతకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని, సకాలంలో యూరియా బస్తాలను అందజేయకుండా కాలయాపన చేస్తుందన్నారు.
కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా తులం బంగారం, మహాలక్ష్మి పథకంలో నెలకు 2500 ఇవ్వకుండా తెలంగాణ ఆడపడుచులను మోసం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉప్పరి రమేష్, ప్రధాన కార్యదర్శి అతెల్లి తిరుమలేష్, పొన్నాల రంజిత్, కామారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ నరేందర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బసవ రెడ్డి, యాదగిరి గౌడ్, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు రాజశేఖర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
6 గ్యారంటీలు మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం: బీజేపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES