Saturday, March 28, 2026
E-PAPER
Homeజిల్లాలుఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం

ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం

- Advertisement -

– ఆరు గ్యారంటీల ద్వారా ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో నిధుల కేటాయింపులు లేవు
– తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా మోసం చేసింది
– నయ వంచక కాంగ్రెస్ పాలనను ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తాం
– బాల్కొండ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకుల
 నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో హామీలు ఇచ్చి గడిచిన రెండు సంవత్సరాలుగా 6 గ్యారంటీ అమలు పరచకుండా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను మోసం చేసిందని బాల్కొండ నియోజకవర్గం టిఆర్ఎస్ నాయకులు విమర్శించారు.అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6 గ్యారంటీలో అమలు కోసం నిధులు కూడా కేటాయించకుండా ఇంకా కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుందన్నారు. శనివారం వేల్పూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు మాట్లాడారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దె నెక్కిందని అన్నారు.మేము అధికారం లోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్ని అమలు చేస్తాం అని ఎన్నికల్లో ప్రతి వేదికలో చెప్పారని గుర్తు చేశారు.ప్రజలను నమ్మించడానికి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనాడు గ్యారంటీ కార్డులను పంచి ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించారు.

కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చి 25 నెలలు కావస్తుంది కానీ ఏ ఒక్క హామీ కుడా సక్రమంగా అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.పథకాల అమలు తక్కువ… ప్రచారం ఎక్కువ అన్న తీరున కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతుందని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి బడ్జెట్ లో నిదులు కేటాయించకుండా ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు.ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు అయ్యే వరకు ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు చేసిన మోసలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతుందని హెచ్చరించారు.ఈ సమావేశంలో 

నాగంపేట్ శేఖర్ రెడ్డి, బద్దం ప్రవీణ్ రెడ్డి, కల్లెడ ఏలీయా, దాసరి వెంకటేష్, రేగుంట దేవేందర్, జైడి నాగధర్, బద్దం రవి, బద్దం నర్సారెడ్డి, రేగుల్ల రాములు, దొంకంటి నర్సయ్య, చౌట్ పల్లి రవి, ఆర్మూర్ మహేష్, రాజా పూర్ణనందం, కొలిపాక ఉపేందర్, శ్రీకాంత్, గడ్డం స్వామి, ఏలేటి రమేష్, ప్రతాప్, భోజపల్లి సురేష్, లోలపు సుమన్, బూరుకల కమలాకర్, డోల్ల రాజేశ్వర్, గంగారెడ్డి, నారాయణ, గంగాధర్, సూర్జీల్, శ్రీనివాస్, శంకర్ గౌడ్, ఉమా శంకర్, ఆనంద్, యూసుఫ్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -