Tuesday, November 25, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని సీపీఐ(ఎం) జన్నారం మండల కార్యదర్శి కొండగుర్ల లింగన్న అన్నారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని సుందర మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని సుందరయ్య నగర్ కాలనీలో సీపీఐ(ఎం), వ్యవసాయ కార్మిక సంఘం శాఖ సమావేశం  మగ్గిడి జయ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ శాఖ సమావేశానికి ముఖ్య అతిథులుగా సీపీఐ(ఎం) జన్నారం మండల కార్యదర్శి  కొండగోర్ల లింగన్న, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే అబ్దుల్లా హాజరై స్థానిక సమస్యలపై చర్చించారు. కాలనీలో ముఖ్యంగా మురికి కాలువలు లేక వార్డులన్నీ కంపు కొడుతున్నాయి అన్నారు. రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం అధికారులు స్పందించి వెంటనే పరిష్కారం చాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -