Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతును బాధ పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

రైతును బాధ పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

- Advertisement -

నవతెలంగాణ – మద్దూరు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులను బాధపెడుతుందని దూల్మిట్ట మండల ఎన్నికల ఇంచార్జ్ ముస్త్యాల బాల నరసయ్య అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మండలంలోని దూల్మిట్ట, లింగాపూర్, గ్రామాలలో బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సన్నాక సమావేశం మండల అధ్యక్షుడు మంద యాదగిరి, అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. రైతు సమస్యలు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి, మాజీ జడ్పిటిసి నాచగోని పద్మ వెంకట్ గౌడ్, మాజీ సర్పంచ్ కనకయ్య, నాయకులు  అంజయ్య, బడుగు సాయిలు ,లింగం, గ్రామ శాఖ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -