Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా అందించడం లేదు…

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా అందించడం లేదు…

- Advertisement -

– ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి  సునీత…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా సకాలంలో అందించటం లేదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిరవేర్చలేదని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె, భువనగిరి మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్రం తెలంగాణ కు రావలసిన యూరియా కోటా మొత్తం అందజేస్తాం అని చెబుతుంటే,  రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం యూరియా కోటాలో 60 శాతం మాత్రమే రాష్ట్రానికి వచ్చిందని , మిగిలిన 40 శాతం రావాల్సింది ఉంది అని అంటున్నారని విమర్శించారు.

వచ్చిన 60 శాతం యూరియా కూడా బ్లాక్ మార్కెట్ కి తరలించానీ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆరోపించారు.  రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  దేశాల మధ్య యుద్ధం వల్ల యూరియా రాష్ట్రానికి రాలేదని అంటున్నారని సునీత మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో రైతులకు ఆరు నెలల ముందే యూరియా బఫర్ స్టాక్ గా ఉండేదని ఆమె గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం లో యూరియా కు కొరతలేదని, క్యూ లైన్ లు లేవని మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్  జడల అమరేందర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, పట్టణ అధ్యక్షులు కిరణ్ కుమార్, నాయకులు జడల యాసిల్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad