Thursday, May 22, 2025
Homeఖమ్మంపేదోడి సొంతింటి కల నెరవేర్చే ది కాంగ్రెస్ ప్రభుత్వమే: ఎమ్మెల్యే

పేదోడి సొంతింటి కల నెరవేర్చే ది కాంగ్రెస్ ప్రభుత్వమే: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
నాడైనా నేడైనా ఏనాడైనా పేదోడి సొంతింటి కల నెరవేర్చే ది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలం, వినాయక పురం పంచాయితీ దబ్బతోగు లో బుధవారం పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా  అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ  పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు హక్కు పత్రాల  పంపిణీ ని చేపట్టారు. ఈ పంచాయితీలో మొదటి విడతగా 54 మంజూరు చేయగా ఆవాస గ్రామం అయిన దబ్బతోగు లో 8 గృహాలు కేటాయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన లబ్ధిదారులకు అర్హత పత్రాలను అందజేసిన అనంతరం వారిని ఉద్దేసించి మాట్లాడారు. పేదవాడి సొంతింటి కల ఊహ గానే మిగల కుండా అర్హులైన  ప్రతీ కుటుంబానికి పక్కా ఇంటి  నిర్మాణం చేపట్టాలని బాధ్యతగా భావించిన సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రతీ నియోజకవర్గానికి మొదటి  విడతలో 3500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించామని అన్నారు.ఐటీడీఏ  పరిధి లో ఉన్న నియోజకవర్గాలకు  అదనంగా మరికొన్ని  ఇందిరమ్మ ఇండ్లు కేటాయించే  ఆలోచన ప్రభుత్వం చేస్తుందని,త్వరలోనే మరి కొన్ని ఇండ్లు అదనంగా తీసుకొచ్చి అర్హులైన పేదలకు కానుకగా అందిస్తామని అన్నారు. ప్రభుత్వ విధివిధానాలను అనుసరించి ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని  లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీఈఈ జి.రాము,ఏఈఈ  మదన్ కుమార్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్,ఎంపీఓ సీతారామరాజు,కాంగ్రెస్  ముఖ్య నాయకులు జూపల్లి రమేష్,తుమ్మ రాంబాబు,జూపల్లి ప్రమోద్, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -