Sunday, March 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మోసపూరిత బడ్జెట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది 

మోసపూరిత బడ్జెట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది 

- Advertisement -

లాకావత్ నరసింహ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు 
నవతెలంగాణ – గోవిందరావుపేట

బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు త్రీవ అన్యాయం ఆరు గ్యారంటీలు,11 డిక్లరేషన్లు అన్నీ మోసమే ఇది అంకెల గారడీ కాదు — అంకెలనే మార్చడం.ఇదే కాంగ్రెస్ దగాకోరు తనానికి నిదర్శనం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత బడ్జెట్ను ప్రవేశపెట్టి వారి ప్రజలను మరోసారి మోసం చేసిందని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లాకావత్ నరసింహ నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నరసింహ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ కేవలం అంకెల గారడి మాత్రమేనని అన్నారు. దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని పేర్కొన్నారు.

దళితులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు ఈ బడ్జెట్ న్యాయం చేయలేదు అని విమర్శించారు.బడుగు బలహీన వర్గాల హక్కులను కాల రాసిన బడ్జెట్ ఇది..ఒకవైపు 42% రాజకీయ రిజర్వేషన్ల విషయంలో మోసం చేశారు. మరోవైపు బడ్జెట్ కేటాయింపుల్లో కూడా బీసీలను తీవ్రంగా మోసం చేశారు అని మండిపడ్డారు. బడ్జెట్‌లో బీసీలకు కేవలం రూ.12,511 కోట్లు మాత్రమే కేటాయించడం త్రివ ద్రోహం, ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్లు ఇస్తామని చెప్పి, మూడు బడ్జెట్ లో కలిపి కేవలం రూ.33,116 కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -